Prajagalam Sabha : చంద్రబాబు ప్రజాగళం సభ ఏర్పాట్లను పరిశీలించిన భాష్యం ప్రవీణ్..

Bhashyam Praveen arrangements of Chandrababu Prajagalam Sabha
Prajagalam Sabha : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చం ద్రబాబు నాయుడు ప్రజాగళం సభ ఏర్పాట్లను పెదకూరపాడు టిడిపి ఉమ్మడి అభ్యర్థి పరిశీలిం చారు. ఈనెల 6 తారీకున పెద్దకూరపాడు నియోజ కవర్గ క్రోసూరు మండల కేంద్రంలో హెలిప్యాడ్ తో పాటు సభా స్థలాన్ని టిడిపి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. పెదకూరపాడు నియోజకవర్గం పరిశీలకులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు తో కలిసి భాష్యం ప్రవీణ్ పరిశీలించారు.
హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమై నటు వంటి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పెదకూరపాడు నియోజకవర్గ అభ్యర్థి స్వయంగా పరిశీలిస్తు న్నా రు. టికెట్ కేటాయించిన తర్వాత మొట్టమొ దటిసా రిగా పార్టీ అధినేత నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు భాష్యం ప్రవీణ్ సన్నాహాలు చేస్తున్నారు.