Bhashyam Lavanya : ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న భాష్యం లావణ్య

Bhashyam Lavanya Campaign
Bhashyam Lavanya : బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు ఆమె వెళ్లి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు.
రోడ్లు సరిగా లేవని, తాగునీరు అందరికి అందుబాటులో లేదని, పెన్షన్లు అర్హులైనవారికి అందడం లేదని గ్రామస్థులు ఆమెకు వివరించారు. అనంతరం గ్రామస్థులతో లావణ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. నిరుద్యోగ భృతి రూ. 3 వేలు కల్పిస్తామని, బడి పిల్లలకు ఏటా రూ. 15 వేలు అందిస్తామని లావణ్య గ్రామస్థులకు వివరించారు.
సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా 40 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాపాయపాలెం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.