Bhashyam Lavanya : మామిళ్ళపల్లి విజయలక్ష్మిని సన్మానించిన భాష్యం లావణ్య
– విజయలక్ష్మిని వరించిన గిన్నిస్ బుక్ అవార్డు

Bhashyam Lavanya
Bhashyam Lavanya : వైద్యులు, మామళ్ళపల్లి మధుసూదన్ రావు భార్య మామిళ్ళపల్లి విజయలక్ష్మిని కేశ పోషణ విభాగంలో గిన్నిస్ బుక్ వారు గుర్తించి. అవార్డు నందించింది. ఈ సందర్భంగా పెద్దకూరపాడు నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి లావణ్య మామిళ్ళపల్లి విజయలక్ష్మిని శుక్రవారం అచ్చంపేట గ్రామంలోని సాయిబాబా గుడిలో సన్మానించారు.
ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డు సాధించి పెద్దకూరపాడు నియోజకవర్గానికి, మరి ముఖ్యంగా అచ్చంపేట గ్రామానికి గుర్తింపు తెచ్చినందుకు గర్వంగా ఉందని పలువురు ప్రశంసించి విజయలక్ష్మిని అభినందించారు. ఈ కార్యక్రమం టిడిపి కన్వీనర్ తిమ్మిశెట్టి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.