Bhartiyadudu 2 : భారతీయుడు 2 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ.. ఎప్పటి నుంచంటే
Bhartiyadudu 2 : జూలై 12న తెలుగుతోపాటు తమిళంలోనూ విడుదలైన భారతీయుడు 2 మిక్స్ డ్ టాక్ అందుకుంది. డైరెక్టర్ శంకర్ తన మార్కును సినిమాలో చూపించలేకపోయారని ప్రేక్షకులు విమర్శించారు. కమల్ హాసన్, శంకర్ కాంబో లో వచ్చిన భారతీయుడు భారీ సక్సెస్ సాధించి సినిమా రంగంలో చరిత్ర సృష్టించింది. కానీ భారతీయుడు – 2 చిత్రం మాత్రం సరైన వసూళ్లను రాబట్టలేకపోయింది.
అయితే సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోవడంతో ఓటీటీలోకి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
అటు ఈ మూవీ థియేట్రికల్ రన్ కూడా సరిగ్గా లేదని గుర్తించిన చిత్ర నిర్మాణ బృందం ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిల్మ్ మేకర్స్ అఫ్ డేట్స్ ప్రకారం.. భారతీయుడు 2 సినిమా ఆగస్టు 2 తేదీనాడే సినిమా ఓటీటీలోకి రానుంది.
భారతీయుడు 2 సినిమాలను రూ.200 కోట్ల బడ్జెట్ తో తీయగా.. కరోనా, తదితర కారణాల వల్ల ఆరు సంవత్సరాల కిందట షూటింగ్ ప్రారంభం కాగా.. చివరకు జులై 12న తేదీ 2024 లో విడుదల చేశారు. ఎట్టకేలకు ఆడియన్స్ దగ్గరకు వచ్చినా.. పెద్దగా కలెక్షన్లు రాబట్టలేదు. మొత్తం మీద వంద కోట్లు మాత్రమే కలెక్షన్ చేసినట్లు తెలుస్తోంది. తమిళంలో ఎక్కువ మంది చూసినా.. భారతీయుడు మొదటి సినిమాకు ఉన్నంత క్రేజ్ దీనికి రాలేదు. భారతీయుడు సినిమాకు సీక్వెల్ అంటే అంతకంటే గొప్ప రేంజ్ లో ఉండాలి.
కానీ ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాతనే చాలా మంది డిసైడ్ అయిపోయారు. ఈ సారి నిరాశ తప్పదని భావించారు. సినిమాలో సిద్ధార్థ్ క్యారెక్టర్ ఆసక్తి కరంగా ఉండగా.. కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు హిరోయిన్లుగా నటించారు. మొత్తం మీద ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ ఆకట్టుకోలేకపోయింది. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.