Sharmila : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే టైమ్ చాలా దగ్గరకు వచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగు పార్టీల నాయకులు మాటల తూటాలు బలంగా దిగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి తేవాలని తీవ్రంగా శ్రమిస్తోంది. 23 నుంచి ప్రచారం సైతం మొదలు పెట్టింది. నాయకులను సమన్వయం చేసుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో తను సీఎం కావాలని తన భర్త అనిల్ తో ఢిల్లీకి రాయభారం పంపిందని వైసీపీ నాయకుడి ఆరోపణలపై ఆమె స్పందించింది. ఈ నేపథ్యంలో తన వదిన భారతి రెడ్డి పేరును మొదటి సారి తన నోటి నుంచి పలికింది షర్మిల.
జగన్ అరెస్ట్ తర్వాత షర్మిల భర్త అనిల్ ఢిల్లీ వెళ్లి షర్మిలను సీఎం చేయాలని కోరారని ఇటీవల ఓ వైసీపీ నాయకుడి క్లిప్పింగ్ వైరల్ అయ్యింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘నాపై, నా భర్తపై అనుచిత ఆరోపణలు చేయడానికి వైసీపీ జోకర్లను పంపుతోంది. వదిన భారతిరెడ్డితో కలిసి తన భర్త ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలిసిన విషయం అందరికీ తెలిసిందే. నా భర్త నాకు సీఎం పదవి ఇవ్వాలని అడుగుతున్నారని ఈ వైసీపీ నేతలు భారతి చేసిన ఆరోపణలకు బలం చేకూర్చగలరా? అని ప్రశ్నించారు.
‘నా భర్త అనిల్ అప్పటి కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లి నాకు సీఎం పదవి ఇవ్వాలని అడిగారని ఈ వైసీపీ జోకర్ చెబుతున్నాడు. ప్రణబ్ లేరని, ఈ ఆరోపణలపై తాను స్పందించలేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తుంది. తమ ఆరోపణలను ప్రణబ్ కుమారుడి ద్వారా గానీ, భారతిరెడ్డి ద్వారా గానీ నిరూపించాలని సవాల్ విసిరారు.