Bharatiya Nyaya Sanhita : భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) కింద తొలి కేసు నమోదయింది. ఢిల్లీలో ఓ వీధి వ్యాపారిపై పోలీసులు ఈ కేసు పెట్టారు. భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎసకఏ) అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత కింద తొలి కేసు నమోదయింది. న్యూ ఢిలీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్ లోని సెక్షన్ 285 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీలోని ఒక వ్యాపారి రోడ్డు మీద వాటర్ బాటిల్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. దానివల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, దాన్ని మరో చోటుకు తరలించమని అతని పోలీసులు పలుమార్లు చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పోలీసులు వీడియోగా తీసి, కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.