Bharat Ratna to NTR : విశ్వ విఖ్యాత నట సౌరభౌముడు, తెలుగు తేజం, మాజీ ముఖ్యమంత్రి లెజెండరీ పర్సనాలిటీ నందమూరి తారక రామారావును ‘భారతరత్న’ ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ ఉంది. రాష్ట్ర విభజన తర్వాత అది మరింత పెరిగింది.
ఇప్పుడు దీనిపై కేంద్రం ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తు్న్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం (మార్చి 13) కీలక సమావేశం నిర్వహించి. ఈ సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. భారత ప్రభుత్వం ఈ ఏడాది ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించింది. ఎన్టీఆర్ కు ఇవ్వడం ప్రకటిస్తే ఆరుగురికి ఇచ్చినట్లు అవుతుంది.
అయితే టీడీపీ మళ్లీ ఎన్డీయే కూటమిలోకి రావడంతోనే ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించే అవకాశం ఉందని కొన్ని చోట్ల వాదనలు వినిపిస్తున్నాయి. కొంత కాలంగా టీడీపీ ఈ డిమాండ్ నెరవేర్చాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అనౌన్స్ అయితే పెద్ద విజయమే సాధించినట్లు అవుతుంది. ఇది తెలుగు సమాజానికి కూడా పెద్ద ఘట్టం అవుతుంది.
మరో విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. ఎన్టీఆర్‌కు అవార్డు రావడం ప్రచారంలో అతి పెద్ద అంశం. కొన్ని నెలల ముందు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ బొమ్మతో ప్రత్యేక నాణేన్ని విడుదల చేసింది.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకుంటే ఎన్డీయేలో చేరడంలో అర్థం ఏంటని? ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉన్నందున, టీడీపీ దీనికి కృషి చేస్తుంది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కూడా ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెట్టి మంచి మార్కులే కొట్టేసింది. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఎన్టీఆర్‌కు పెద్ద గౌరవం దక్కే అవకాశం ఉంది.
జాతీయ రాజకీయాల్లో దక్షిణాది నేతలు గుర్తింపు తెచ్చుకోవడం చాలా అరుదు. వాటన్నింటినీ దాటుకొని ఎన్టీఆర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చాడు.