
Tirumala Devotes died
Tirumala News : తిరుమలలో ఓ భక్తురాలు మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది. తిరుమల వైకుంఠం కాంప్లెక్స్ లో గుండెపోటుతో ఓ భక్తురాలు మృతి చెందింది. శనివారం తెల్లవారు జామున వైకుంఠ కాంప్తెక్స్ క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుల అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు.
మృతురాలిని లండన్ లో స్థిరపడిన కడప జిల్లా వాసి ఝాన్సీ (32)గా గుర్తించారు. ఆమెకు కవల పిల్లలున్నారు. ఝాన్సీ మృతదేహాన్ని రుయా ఆస్పత్రికి తరలించారు. రెండు మెట్ల మార్గాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్ లలో డాక్టర్ తో కూడి అత్యవసర వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నారు.