Betting apps Case : రానా, విజయ్‌ దేవరకొండ సహా 25 మంది సినీ ప్రముఖులపై కేసు

Betting apps Case

Betting apps Case

Betting apps Case : బెట్టింగ్‌ యాప్‌లను ప్రోత్సహించినందుకు రానా దగ్గుబాటి, విజయ్‌ దేవరకొండలతో పాటు 25 మంది సినీ ప్రముఖులు చిక్కుల్లో పడ్డారు. మియాపూర్‌కు చెందిన ప్రమోద్‌ శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్‌ యాప్‌ల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి మోసాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేసు నమోదు చేసిన వారిలో ప్రకాశ్‌రాజ్‌, మంచు లక్ష్మి, ప్రణీత, శ్రీముఖి, రీతూ చౌదరి, శ్యామల, నీతూ అగర్వాల్‌, విష్ణు ప్రియ, వర్షిణి, అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్‌, శోభాశెట్టి, అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్‌, పద్మావతి, పండు, యూట్యూబర్లు ఇమ్రాన్‌ఖాన్‌, హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ, బండారు సుప్రీత ఉన్నారు.

ఈ కేసుపై మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రముఖులు ఎంత మొత్తం తీసుకుని ఈ యాప్‌లను ప్రమోట్ చేశారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటన సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.