JAISW News Telugu

30 Crores Betting : వైసీపీ గెలుస్తుందని 30 కోట్ల బెట్టింగ్.. సొమ్ము చెల్లించక చివరకు ఆత్మహత్య

30 Crores Betting

30 Crores Betting

30 Crores Betting : మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుస్తుందని ఎంతో మంది బెట్టింగులు కట్టారు. వేల కోట్లలో ఈ బెట్టింగ్ జరుగడం గమనార్హం. వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కట్టిన వారు తీవ్రంగా నష్టపోయారు. ఈ బెట్టింగ్‌ల వల్ల భారీగా నష్టపోయి ఓ నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

 ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్‌ రెడ్డి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలువురితో రూ.30 కోట్ల బెట్టింగ్‌ కట్టాడు. ఈ నెల 4వ తేదీన వైసీపీ ఓడిపోవడంతో ఇల్లు విడిచి వెళ్లాడు. ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు ఇంటికి వచ్చి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లారు. మరుసటి రోజు ఇంటికొచ్చిన వేణుగోపాల్‌ మనస్తాపానికి గురయ్యాడు. నిన్న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక నాయకుడు, ఏడో వార్డు సభ్యుడు జగ్గవరపు వేణుగోపాలరెడ్డి (52) అనే వ్యక్తి వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్లు బెట్టింగ్‌ పెట్టాడు. గ్రామంలో రాజకీయంగా చురుగ్గా ఉన్న వేణుగోపాలరెడ్డి తన పార్టీ విజయంపై నమ్మకంతో వివిధ గ్రామాలలో భారీగా పందేలు కాశాడు. అయితే, ఎన్నికల ఫలితాలు వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా లేకపోవడంతో వేణుగోపాలరెడ్డికి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఓట్ల లెక్కింపు రోజు గ్రామం నుంచి వేణుగోపాల రెడ్డి అదృశ్యమయ్యాడు. కోట్లలో బెట్టింగ్ కట్టడంతో అతడికి కట్టే మార్గం కనిపించలేదు. అతనితో బెట్టింగ్‌లు కట్టిన వారు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. జూన్ 7వ తేదీన వేణుగోపాలరెడ్డి ఇంట్లోకి చొరబడి ఎయిర్ కండీషనర్లు, సోఫాలు, బెడ్‌లు వంటి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చివరకు ప్రాణాలు తీసుకున్నాడు. రాజకీయాల్లో ఆసక్తి ఉండాలని కానీ ఇలా కోట్లలో బెట్టింగ్ లు కట్టి అనవసరంగా డబ్బును కోల్పోవడం, లేదా ప్రాణాలు తీసుకోవడం చేసుకోవద్దని విశ్లేషకులు హితువు పలుకుతున్నారు.

Exit mobile version