Mint Leaves : మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో ఆకులు ప్రధానమైనవి. ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆకు కూరల్లో మంచి విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి. దీంతో నిత్యం ఆకుకూరలు తింటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో పుదీనా కూడా మనకు ఎంతో మేలు చేకూరుస్తుంది. దీంతో జీర్ణ సంబంధమైన ఎంజైమ్ లు పెరిగి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
ఈ రోజుల్లో మలబద్ధకం కూడా ప్రధాన సమస్యగా పరిణమిస్తోంది. ఉదయం పూట రెండు పుదీనా ఆకులు తింటే మలబద్ధకం సమస్య లేకుండా చేస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తుంది. గాలి తీసుకునే క్రమంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటుంది. దీర్ఘకాలికంగా వచ్చే దగ్గును నివారిస్తుంది. నోటి దుర్వాసనకు కూడా చెక్ పెడుతుంది. పుదీనా ఆకులు మనకు చాలా రకాలుగా ఉపయోగపడతాయి.
ఇప్పుడు చాలా మందిలో అల్జీమర్స్ వ్యాధి వస్తోంది. అల్జీమర్స్ అంటే మతిమరుపు. జ్ణాపకశక్తిని కోల్పోవడం. జ్ణాపకశక్తి పెరిగేందుకు పుదీనా ఆకులు దోహదపడతాయి. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా మన శరీరంలో ఎన్నో రకాల సమస్యలకు పుదీనా ఒక మంచి మందులా వినియోగపడుతుంది.
పుదీనా వాడకంతో గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధిని కూడా నియంత్రిస్తుంది. ఇలా పుదీనా మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలకు పరిష్కార మార్గాలు సూచిస్తుంది. మన శరీరం రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే పుదీనా తప్పకుండా తీసుకోవాల్సిందే. పుదీనా వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు ఉన్నందున దాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిదే.