Neem Leaves : ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Neem Leaves

Neem Leaves

Neem Leaves : ఆయుర్వేదంలో వేపకు మంచి ప్రాధాన్యం ఉంటుంది. మన శరీరానికి చేదుగా ఉండేవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే పూర్వం రోజుల్లో వేపను చాలా రకాలుగా వినియోగించేవారు. పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వేసుకునే వారు. వేపలో మన ఆరోగ్యాన్ని కాపాడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే మన ఇంటి పెరట్లో వేప చెట్టు పెంచుకోవడం మంచిదంటారు.

వేపలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్ గ్లైసెమిక్, యాంటీ అల్సర్, యాంటీ మలేరియల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మ్యుటాజెనిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలున్నాయి. విటమిన్ ఎ,సి, కెరొటినాయిడ్స్ , లినోలియిక్, ఒలియిక్ సమ్మేళనాలు ఉంటాయి. రోజు ఖాళీ కడుపుతో వేపాకు తింటే ఆరోగ్య లాభాలు ఎన్నో దక్కుతాయి.

పరగడుపున వేపాకు తింటే పేగులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. అలిమెంటరీ కెనాల్ ను వ్యాధి కారకాల నుంచి కాపాడుతుంది. మనం తినే ఆహారాలు, మద్యపానం లాంటి అలవాట్లతో ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. వేపాకను ఖాళీ కడుపుతో తింటే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేపాకు డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది. ప్రతిరోజు లేవగానే వేపాకు తిన్నా, ఆకులతో కాషాయం చేసుకుని తాగినా షుగర్ లెవల్స్ తగ్గుతాయి. మలబద్ధకానికి వేపాకు చెక్ పెడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు వేపాకు తినడం వల్ల మలం సాఫీగా సాగిపోతుంది. రోజుకు ఐదారు ఆకులు మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

ఖాళీ కడుపుతో వేపాకు తింటే కాలేయం కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. లివర్ కణాలు దెబ్బతినకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలోని మలినాలను పోయేలా చేస్తుంది. లివర్ పనితీరును మెరుగు పరుస్తుందనడంలో సందేహం లేదు.

TAGS