JAISW News Telugu

Eating Food with Your Hands : చేతితో ఆహారం తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..

Eating Food with Your Hands

Eating Food with Your Hands

Eating Food with Your Hands : శారీరక ధర్మం.. అవయవాలు స్పందిస్తున్న తీరును భారతీయులు ఎప్పుడో వివరించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచానికి అనేక విషయాలను చెప్పాయి. ఆయుర్వేధంతో వ్యాధులను నివారించే విధానం నుంచి శస్త్ర చికిత్స (ఆపరేషన్) చేసే విధానం వరకు అన్నీ ప్రపంచానికి భారత్ పెట్టిన భిక్ష అనే చెప్పవచ్చు. నేడు విదేశాలు శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తూ.. వ్యాధులకు మందులు కనిపెడుతున్నా.. ఇప్పుడు కూడా కొవిడ్ వ్యాక్సిన్ ను పేద దేశాలకు ఇచ్చిన ఘనత భారత్ పేరుపైనే ఉంది.

ఇవన్నీ పక్కన ఉంచితే.. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా శరీరం దృఢంగా ఉండేందుకు పాతకాలం నుంచి కొన్ని పద్ధతులను పాటించేవారు. కానీ రాను రాను ఆ పద్ధతులు కాల గర్భంలో కలిసిపోయాయి. ఫారిన్స్ కల్చర్ ను అలవాటు చేసుకుంటున్న భారతీయులు ఆయుష్షును తగ్గించుకుంటున్నారు. శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో పని చేయాలని నియమం ఉంది. కానీ ఆ అవయవం చేసే పని పనిముట్టుకు ఇస్తే బాడీ నేచర్ దెబ్బతింటుంది.

విదేశాల్లో భోజనం చేసేందుకు ఉపయోగించేది స్పూన్ కొన్ని దేశాల్లో చాప్ స్టిక్స్ వాడుతారు. కానీ భారత్ లో మాత్రం చేతినే వాడుతారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆహారం అనేది అతి పవిత్రమైనది. శరీరం ముందుకు సాగాలంటే ఇంధనం ఆహారమే. అయితే అది తినే విధానం కూడా అలాగే ఉండాలి. చేయి ఆహారంలోకి వెళ్లిన సమయంలో నోటిలో లాలాజలం ఊరుతుంది. బ్రెయిన్ ఆహారం తింటున్నారన్న ఫీల్ కల్పిస్తుంది. దీంతో జీర్ణాశయంలో యాసిడ్స్ ను రిలీజ్ చేస్తుంది. ఇంకా చేతిలోని ఒక్కో వేలు పంచ భూతాల్లోని ఒక్కో దాన్ని చూపిస్తుంది. కాబట్టి పంచ భూతాలు పెట్టిన భిక్షగా ఆహారం స్వీకరిస్తాం.

కానీ స్పూన్ తో తింటే ఆ ఫీల్ రాదు. పైగా స్పూన్ స్మెల్ కూడా బాగుండదు. కాబట్టి తీసుకున్న ఆహారం ఫీల్ అనిపించదు. కాబట్టి ఆహారాన్ని చేతితో తింటేనే మంచిదని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మరిన్ని విషయాలు ఈ వీడియోలు తెలుసుకోండి

Exit mobile version