Kuppintaku Tea : హరితమంజరిని కుప్పింటాకు అంటారు. దీన్ని ఆంగ్లంలో నెట్టెల్ అని అంటుంటారు. దీంతో టీ తయారు చేసుకుని తాగితే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ,సి,కె, ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో దీని టీకి ప్రాధాన్యం ఏర్పడింది. కుప్పింటాకు పొడి కూడా మార్కెట్ల దొరుకుతుంది. దీంతో కూడా టీ తయారు చేసుకుని తాగడం వల్ల అనేక లాభాలుంటాయి.
ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఈ టీని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో వాపులు తగ్గిస్తాయి. అర్థరైటిస్ నొప్పులు, అలర్జీలు దూరమవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కాపాడతాయి. మన రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీంతో మనకు అనేక ప్రయోజనాలు ఉంటాయి.
ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కుప్పింటాకు టీ తాగితే గుండె జబ్బుల ముప్పు కూడా రాకుండా ఉంటుంది. ఇందులో యాంటీ హిస్టామైన్ లక్షణాలు కనిపిస్తాయి. అలర్జీలను తగ్గిస్తాయి. తుమ్ములు, దురద వంటి లక్షణాలు లేకుండా చేస్తాయి. రోజు ఈ టీ తాగడం వల్ల మన శరీరానికి ఎంతో ఉపశమనం లభిస్తుంది.
కుప్పింటాకు టీ మధుమేహులకు చాలా బాగా పని చేస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ట్యాక్సిన్స్ ను తొలగించడంలో సాయపడుతుంది. ఇలా కుప్పింటాకు టీ తాగడం మన ఆరోగ్యానికి ఎంతో మేలు.