Benefits of Credit Cards : మారుతున్న జీవన పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకులు విరివిగా క్రెడిట్ కార్డులను ఇస్తున్నాయి. ఇందులో సాధారణ వాటితో పోలిస్తే బ్రాండెడ్ కార్డులతో అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొన్ని బ్రాండ్లు, రిటైలర్లు, వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి బ్యాంకులు, బ్యాంకేతర సంస్థలు వీటిని తీసుకువచ్చాయి. ఇంకా మనం వాడుకున్న మొత్తాన్ని ఈఎంఐ (EMI)లో కట్టుకునే వసతి, ప్రాసెసింగ్ ఫీజుపై రాయితీలను కూడా అందజేస్తున్నాయి.
మీ దైనందన, నెలవారీ అవసరాలను బట్టి ఏ కార్డు బెస్ట్, ఏది సరిపోదో సరిగ్గా తెలుసుకొని వాడితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కొన్ని కార్డులు, వాటితో కలిగే లాభాలను ఇక్కడ తెలుసుకుందాం.
రిలయన్స్ ఎస్‌బీఐ కార్డు..
ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) రిలయన్స్ కార్డును ప్రొవైడ్ చేస్తుంది. ఈ కార్డు జాయినింగ్ ఫీజు రూ. 499+జీఎస్టీ. వెల్ కం బెనిఫిట్స్ కింద రూ. 500 విలువైన రిలయన్స్ రిటైల్ ఓచర్ అందుతుంది. ఈ కార్డుతో ఏడాదిలో రూ. లక్ష వరకు కొనుగోలు జరిగితే తర్వాతి సంవత్సరం యానువల్ ఫీజ్ ఉండదు.
ఇక, రిలయన్స్ రిటైల్ స్టోర్ లో కొనుగోలు చేసిన ప్రతీ రూ. 100కు 5 రివార్డు పాయింట్లు ఉంటాయి. ట్రెండ్స్, అజియో, సెంట్రో, అర్బన్ లేడర్, జివామె, జియో మార్ట్ లో కొనుగోళ్లకు 5 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఇందులోనే రూ. 2999తో ప్రీమియం కార్డు కూడా ఉంటుంది. ఈ కార్డుతో వెల్ కమ్ బెనిఫిట్ కింద రూ. 3000 విలువైన రిలయన్స్ రిటైల్ ఓచర్ ఇస్తారు. దీంతో రూ. 3లక్షల కంటే ఎక్కువ కొనుగోలు చేస్తే ఫీజు ఉండదు. రిలయన్స్ స్టోర్ లలో ప్రతీ రూ. 100 కు 10 రివార్డు పాయింట్లు వస్తాయి. బుక్‌మై షోలో ప్రతి నెలా రూ.250 విలువైన మూవీ టికెట్ ఫ్రీ గా దొరుకుతుంది. ఎయిర్ పోర్ట్ లో ఏడాదిలో 8 లాంజ్ యాక్సెస్ లు ఉంటాయి. వీటితో పాటు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో 4 లాంజ్ యాక్సెస్ లు లభిస్తాయి. ఒక రివార్డు పాయింట్ కు0.25 పైసలు.
ఐసీఐసీఐ అమెజాన్ పే..
ఈ కార్డు తరుచూ అమెజాన్ లో షాపింగ్ చేసే వారికి చాలా బాగుంటుంది. ఎలాంటి జాయినింగ్, వార్షిక ఫీజులు ఉండవు. కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్ ఉంటుంది. ఇది అమెజాన్ వ్యాలెట్ లో యాడ్ అవుతుంది. తర్వాతి కొనుగోళ్లలో దీన్ని వాడుకోవచ్చు.
ప్రైమ్ కస్టమర్లకు 5 శాతం, నాన్-ప్రైమ్ కస్టమర్లకు 3 శాతం క్యాష్ బ్యాక్ వస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్..
ఆన్ లైన్ షాపింగ్ చేసేవారి కోసం యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ కార్డును తీసుకువచ్చింది. క్యాష్ బ్యాక్ ఈ కార్డు స్పెషల్. ఫ్లిప్ కార్ట్ కొనుగోళ్లలో 5 శాతం క్యాష్ బ్యాక్, స్విగ్గీ ఆర్డర్లపై రూ. 600 వరకూ తగ్గింపు వస్తుంది. కల్ట్, ఫిట్, పీవీఆర్, స్విగ్గీ, టాటా ప్లే, ఊబర్, క్లియర్‌ట్రిప్ పై 4 శాతం క్యాష్‌బ్యాక్ ఉంటుంది.
కోటక్ మింత్రా..
ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ మింత్రాకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని కొటక్ బ్యాంక్ మింత్రా కార్డును తీసుకువచ్చింది. ఆనువల్ ఫీ రూ.500, జాయిన్ ఆర్ కింద మింత్రా రూ. 500 ఓచర్ లభిస్తుంది. మింత్రా కొనుగోళ్లపై 7.5 శాతం తగ్గింపు ఇస్తుంది. స్విగ్గీ, పీవీఆర్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, క్లియర్‌ట్రిప్, అర్బన్ కంపెనీ కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తుంది. రూ.2 లక్షలపైన ఖర్చు చేస్తే వార్షిక ఫీజును రద్దు చేస్తుంది.
ఎస్‌బీఐ యాత్రా..
ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి, పర్యాటకులకు ఈ కార్డు ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎయిర్ టికెట్లు, హోటల్ రూంలపై రాయితీ పొందవచ్చు. జాయినింగ్ ఫీ రూ. 499, ఏడాదికి రూ. లక్ష ఉపయోగిస్తే ఆనువల్ ఫీ ఉండదు.
వెల్ కమ్ బెనిఫిట్ కింద రూ.8,250 వోచర్ ఇస్తారు. కనీసం రూ.5,000 విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1000 డిస్కౌంట్. రూ.40 వేల అంతర్జాతీయ విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.4000 డిస్కౌంట్ వస్తుంది. దేశీయ హోటల్ బుకింగ్‌లపై 20 శాతం డిస్కౌంట్ ఉంటుంది. బుకింగ్ విలువ రూ.3000 దాటాలి. ఈ కార్డుతో బుక్ చేసుకున్న విమాన టికెట్లపై రూ.50 లక్షల ఎయిర్ యాక్సిడెంట్ బీమా కూడా ఉంటుంది.