Producers Behind Miracles : సినిమా రంగంలో టెక్నాలజీ రోజురోజుకూ పెరుగుతున్నది. చిన్న సినిమా కూడా టెక్నాలజీ బాట పడుతున్నది. నిర్మాతలు కూడా స్టార్ కాస్టింగ్ తో పాటు గ్రాఫిక్ వర్క్ కి ప్రాధాన్యం ఇస్తున్నది. ఇప్పుడు ప్రతి సినిమాలో ప్రతి ఫ్రేమ్ కి ఎంతో కొంత గ్రాఫిక్ వర్క్ తప్పనిసరిగా మారింది.
సీజీ వర్క్ వెనక ఎంతో మంది టెక్నీషియన్ల శ్రమ దాగి ఉంది. వారి కష్టం తెరమీద స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో నటీనటులు శరీరాకృతితో పాటు ముఖంలో గ్లామర్ కనిపించేలా చేస్తున్నది మాత్రం వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులే. ప్రతి సినిమాకు వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు ఎంతో శ్రమిస్తున్నార. సన్నివేశానికి తగ్గట్లుగా హీరో బాడీని ఎక్స్ పోజ్ చేయడం, ఫేస్ లో గ్లో చూపించడం అంతా వీఎఫ్ఎక్స్ విభాగమే చూసుకుంటున్నది.
అయితే ఈ క్రమంలో తెలుగు సినిమా నటులు కొందరు బద్దకంగా మారుతున్నరు. వీఎఫ్ఎక్స్ వర్క్ తో హీరోలను సూపర్ హీరోలుగా తీర్చిదిద్దుతున్నారు. బాడీ ఫ్యాట్, పొట్ట, ఇవన్నీ కంప్యూటర్లలో సూపర్ హీరోగా తీర్చిదిద్దుతున్నారు. ముఖంలో మడతలు తొలగించి యవ్వనంగా కనిపించేలా చేస్తున్నారు. దీంతో సినిమా హీరోలు తమ శరీర సౌష్టవం గురించి మర్చిపోతున్నారు. అదంతా గ్రాఫిక్ వర్క్, నిర్మాత చూసుకుంటాడనే స్థాయికి కొందరు హీరోలు చేరుకున్నారు.
సినిమా వీఎఫ్ఎక్స్ పార్ట్ లో మేజర్ గా హీరో ఎలివేషన్స్ తో పాటు బాడీ ఎక్స్ పోజింగ్ మీదే వర్క్ చేస్తున్నారు. దీంతో ఒక్కో సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ హీరోకే దాదాపు రూ. 4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతున్నది. హీరోల లగ్జరీ లైఫ్ స్టైల్, పార్టీలు తదితరలాతో హీరోలు షేప్ అవుట్ అవుతున్నారు.
దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ కి ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో ఫైట్ సీన్లకు డూప్ లను వాడేది. ఇప్పుడు దానికి బాడీ డబుల్ అనే పేరును క్రియేట్ చేశారు. చాలా వరకు సీన్లకు ఈ బాడీ డబుల్ ను టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ప్రజెంట్ టాలీవుడ్ లో కూడా బాడీ డబుల్ సంస్కృతి పెరుగుతున్నది.
టాప్ హీరో సినిమా సగానికి పైగా బాడీ డబుల్ తోనే కానిచ్చేస్తున్నారు. హీరో డేట్లు దొరికినపుడు క్లోజ్ షాట్స్ తీసుకుంటున్నారు. మిగిలిన టైమ్ లో బాడీ డబుల్స్ తో షూట్ చేసుకుంటున్నారు. పెద్ద హీరో సినిమాలో యాక్షన్ సీన్లు ఎక్కువే. అవన్నీ కూడా బాడీ డబుల్స్ తో కానిచ్చేస్తున్నారు.
చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. మొదట్లో ఇది సినిమా క్వాలిటీ కోసమే స్టార్ట్ చేసినా, ఇప్పుడది కచ్చితం అనే స్థాయికి చేరడంతో నిర్మాతకు ఖర్చు మీద పడుతున్నది.