JAISW News Telugu

Operation Akarsh : ఎన్నికల ముందు ‘ఆపరేషన్ ఆకర్ష్’ అందుకోసమే..

Operation Akarsh

Operation Akarsh

Operation Akarsh : తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పాలన కన్నా చేరికలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని మూడు ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అయితే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో కాస్త మొగ్గు ఉండే అవకాశాలే ఉన్నాయి. గతంలో ఎంతో బలంగా ఉన్న బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో దినదినం బలహీనం అయిపోతోంది. నేతలంతా కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తుండడంతో బీఆర్ఎస్ పరిస్థితి దీనంగా మారుతోంది.

 ‘‘తాము గేట్లు ఓపెన్ చేస్తే చాలా మంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే’’ అంటూ ఆ మధ్య సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ గేట్లను లోక్ సభ ఎన్నికలకు ముందే ఓపెన్ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో జోష్ తీసుకొచ్చేందుకు చేరికలు ముమ్మరం చేయాలనుకుంటున్నారు. ఢిల్లీ నుంచి కూడా రేవంత్ కు స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో చేరికలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీయాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ రెడీ చేసినట్టుగా సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. పార్టీలోకి చేరికలకు ఇదే సరైన సమయమని రేవంత్ భావిస్తుండడంతో 9 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీజేపీని కూడా కాస్త వీక్ చేయవచ్చుననేది రేవంత్ ప్లాన్. పార్టీలోకి వరుసగా నేతల చేరికలతో చర్చంతా కాంగ్రెస్ వైపు ఉంటుందని.. అది బీఆర్ఎస్ పైనే కాకుండా బీజేపీపై కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల ముందు తెలివిగా రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్టుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన ఆ 9 మంది ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వెళ్లిన నేతలేనని సమాచారం. ఇదిలా ఉండగా గతంలో కేసీఆర్ చేసిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నాడని, ఇది ప్రజల్లో నెగిటివిటీని తెచ్చే అవకాశం కూడా ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Exit mobile version