Nitish Reddy : 20 ఏళ్ల క్రికెటర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నాలుగో ప్రదర్శనలో T20 క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీని కొట్టడంతో నితీష్ కుమార్ రెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారాడు. మంగళవారం జరిగిన పంజాబ్ కింగ్స్‌పై ఆంధ్రా బ్యాటర్ 37 బంతుల్లో 5 సిక్సర్లతో సహా 64 పరుగులు చేశాడు.
ఇంతకీ, ఈ యంగ్ క్రికెటర్ నితీష్ ఎవరు? ఆయన గురించి ఎంత మందికి తెలుసు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దేశవాళీ క్రికెట్‌లో నితీష్ ఆంధ్రా తరఫున ఆడుతున్నాడు. 8 T20 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 2023లో రెండు IPL మ్యాచ్‌లు ఉన్నాయి. అందులో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.
ఐపీఎల్ 2023 వేలంలో నితీష్‌ను SRH తన బేస్ ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ESPNcricinfo ప్రకారం, నితీష్ ఆంధ్రా తరఫున రంజీ ట్రోఫీలో 7 మ్యాచ్‌లలో 366 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, ఒక ఆఫ్ సెంచరీ చేశాడు.
U-19లో ఇండియా B జట్టు తరపున ఆడిన నితీశ్ 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 566 పరుగులు, 22 లిస్ట్ A గేమ్‌లు ఆడాడు. 36.63 సగటుతో 403 పరుగులు చేశాడు.
నితీష్ గురించి
పుట్టింది: మే 26, 2003, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
బ్యాటింగ్ శైలి: కుడిచేతి
బౌలింగ్ శైలి: కుడి చేయి మీడియం-ఫాస్ట్
ప్లేయింగ్ రోల్: బ్యాటింగ్ ఆల్ రౌండర్
నిన్న (ఏప్రిల్ 9) జరిగిన మ్యాచ్ లో ఆఫ్ సెంచరీ కొట్టిన ఆయన ఓవర్ నైట్ స్టార్ గా మారాడు. ఈ క్రమంలో ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. నితీష్ కుమార్ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అట. ఆయన సినిమాలు విపరీతంగా చూస్తారట. ఏ జట్టులో ఉన్నా ఏ ఫార్మాట్ లో ఆడుతున్నా.. పవన్ కళ్యాణ్ ‘జానీ’లోని ‘నారాజు గాకుర మా అన్నయ్య’ పాటను వింటాడట. ఈ పాట విటే తనకు ఎనర్జీ వస్తుందని చెప్తున్నాడు. ఏది ఏమైనా పవర్ స్టార్ అంటే అందరికీ ఫ్యానే కదా.