Esther : బెడ్రూంలో అలా కనిపించేసరికి తట్టుకోలేకపోయా .. నోయల్ పై ఎస్తేర్ షాకింగ్ కామెంట్స్
Esther Comments : హీరోయిన్ ఎస్తేర్ 2020లో సింగర్ నోయెల్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఎస్తేర్ తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్ల కోసం ఎక్కడికి వెళ్లినా ముందుగా ఆమెను విడాకుల విషయం గురించే గుచ్చి గుచ్చి అడగుతున్నారు. దీంతో ఆమె పలు సందర్భాల్లో అసహనం వ్యక్తం చేసింది. ఇది తన వ్యక్తిగత విషయమని పదే పదే ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టవద్దంటూ కోరుతూ వస్తున్నది.
ఎస్తేర్ తెలుగులో డైరెక్టర్ తేజ దర్శకత్వం వహించిన ‘1000 అబద్ధాలు’ సినిమాతో తెలుగు ఇండస్ర్టీకి పరిచయమమైంది. కమెడియన్ సునీల్ హీరోగా నటించిన ‘భీమవరం బుల్లోడు’లో సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఎస్తేర్ కు హీరోయిన్ గా అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్, వెబ్ సిరిస్ లలో నటిస్తున్నది.
ఇక ఎస్తేర్ కు సింగర్ నోయెల్ తో 2019లో వివాహమైంది. కానీ ఆ జంట వైవాహిక బంధం ఏడాదికే ముగిసింది. మొదట్లో ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని ప్రకటించినా ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక సింగర్ నోయెల్ ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో ఏస్తేర్ పై దారుణంగా విమర్శలు చేశాడు. తనను రోజూ టార్చర్ పెట్టేదని, ఇక విడిపోవడమే కరెక్ట్ అని డైవర్స్ తీసుకున్నానంటూ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే వీటిని ఎస్తేర్ ఖండించింది.
ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన విషయంలో షాకింగ్ కామెంట్స్ చేసింది. నోయెల్ తరచూ వేరే అమ్మాయిలను ఇంటికి తీసుకువచ్చేవాడని, తన కళ్ల ముందే మూడు సార్లు పరాయి అమ్మాయిలతో బెడ్రూంలో కనిపించాడని, అలా కనిపించే సరికి తట్టుకోలేకపోయానని షాకింగ్ కామెంట్స్ చేసింది. నోయెల్ చెప్పేవన్నీ అబద్ధాలనీ సింపతీ కోసం తనపై నిందలు మోపాడని చెప్పుకొచ్చింది. ఇక ఎస్తేర్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.