CM Chandrababu : అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : అసత్య ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. మనం ప్రజలకు నిజం చెప్పే లోపు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పికొట్టాలని చెప్పారు. అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పుపెట్టిన ఘటనలో పోలీసుల తీరుపై సీఎం వద్ద నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైసీపీ నేతలంటూనే రాజకీయ ప్రమేయం లేదని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని నేతలు ప్రస్తావించారు. విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు.