JAISW News Telugu

Be careful : రాబోయే మూడు నెలలు జాగ్రత్త

Be careful Next 3 Months : ఈ ఏడాది ఏప్రిల్ నుండి జూన్ మధ్య దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒడిశా మరియు కర్ణాటక రాష్ట్రాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ డిమాండ్ 9-10% పెరుగుతుందని అంచనా వేశారు. గత ఏడాది మే 30న గరిష్టంగా 250 గిగావాట్ల డిమాండ్ నమోదైన విషయం తెలిసిందే.

Exit mobile version