BCCI : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు ఆడబోమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఇటీవల ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ ఈవెంట్‌లలో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.