BCCI : బీసీసీఐ దెబ్బకు పాక్ బోర్డు విలవిల..ఇప్పట్లో కోలుకోవడం కష్టమే..
BCCI : బీసీసీఐ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విలవిలలాడుతోంది. డబ్బులు లేక సహ హోస్ట్ గా వ్యవహరించిన శ్రీలంకపై ఒత్తిడి తీసుకొస్తోంది. గతేడాది ఆసియా కప్ 2023ను పాకిస్తాన్ నిర్వహించింది. అయితే భారత్.. పాకిస్తాన్ కు వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాల్సి వచ్చింది. కొన్ని మ్యాచ్ లు పాకిస్తాన్ లో, మరికొన్ని మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించారు.
భారత్ ఆడిన మ్యాచులన్నంటికీ శ్రీలంక ఆతిథ్యమిచ్చింది. అయితే మ్యాచ్ లు నిర్వహించాలంటే భారీగా ఖర్చవుతుంది. ముఖ్యంగా రెండు దేశాల్లో మ్యాచ్ లు జరుపడంతో ఖర్చు మరింత పెరిగింది. ఈ ఖర్చులను సహా హోస్ట్ గా వ్యవహరించిన శ్రీలంక బోర్డు కూడా భరించాలని పాక్ క్రికెట్ బోర్డు పట్టుబడుతోంది. ఖర్చులు భరించేందుకు శ్రీలంక నిరాకరిస్తోంది.
పాక్ నుంచి శ్రీలంక.. శ్రీలంక నుంచి పాక్ కు చార్టర్డ్ ఫ్లైట్స్, హోటల్ ఖర్చులు..ఇవన్నీ కలిసి తడిసిమోపెడయ్యాయి. దీంతో ఖర్చును తగ్గించుకునేందుకు పాక్.. శ్రీలంక బోర్డును బయటకు లాగింది. సహా హోస్ట్ కావాలని కోరలేదని.. భారత్ పాక్ రానందున.. తాము సహ హోస్ట్ గా వ్యవహరించామని శ్రీలంక స్పష్టం చేసింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసేదేం లేక.. తమ నుంచి హోస్టింగ్ హక్కులు తొలగించిన ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఖర్చులు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. నిధులు ఇవ్వకుంటే కేసు వేస్తామని బెదిరింపులకు దిగింది. ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా మాత్రం శ్రీలంకను సహ హోస్ట్ గా ఉపయోగించుకున్నందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు..శ్రీలంక బోర్డుకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.