PBKS Vs RR : రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ మధ్య పోరు
PBKS Vs RR : రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ మధ్య అస్సాంలోని బర్ సపుర క్రికెట్ స్టేడియంలో 65 వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి రాజస్థాన్ రాయల్స్ మళ్లీ తన పూర్వపు ఫామ్ ను అందుకోవాలని చూస్తోంది. అస్సాం బాయ్ అయిన రియాన్ పరాగ్ సొంత మైదానంలో ఎలా ఆడతాడనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అస్సాం నుంచి రియాన్ పరాగ్ నేషనల్ క్రికెట్ ఆడాలని అక్కడి అభిమానులు కోరుకుంటున్నారు.
రాజస్థాన్ పంజాబ్ ఇప్పటి వరకు 27 సార్లు తలపడగా.. రాజస్థాన్ 16 సార్లు, పంజాబ్ 11 సార్లు గెలిచింది. రాజస్థాన్ టీం మొదటి తొమ్మిది మ్యాచుల్లో ఎనిమిది గెలిచింది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గెలిచి ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని అనుకుంటోంది. ఈ స్టేడియంలో టీ 20 లో ఎవరేజ్ స్కోరు 213 కాగా.. ఈజీగా రన్స్ చేజ్ చేయొచ్చని గత మ్యాచ్ రికార్డులు చెబుతున్నాయి.
పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్ లో గెలిచినా ఒరిగేది ఏమీ లేదు. ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. పంజాబ్ ఎలిమినేట్ అయినా ఇద్దరు యంగ్ ప్లేయర్లను టీంలో చేర్చుకుని మంచి పని చేసింది. యాక్సిడెంటల్ గా కొనుగోలు చేసిన శశాంక్ సింగ్ సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టగా.. అశుతోష్ శర్మ అంచనాలకు మించిన ఆటతో బెంబెలేత్తించాడు. ముంబయితో మ్యాచ్ లో జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో కొట్టిన సిక్సు నభూతో న భవిష్యతు లా అనిపించేలా చేశాడు.
రాజస్థాన్ రాయల్స్ చివరి మూడు మ్యాచులు ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. దీని నుంచి బయటపడి ప్లే ఆప్స్ కు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని చూస్తోంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ధ్రువ్ జురేల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ధ్రువ్ జురేల్ భారీ ఇన్సింగ్స్ ఆడాలని టీం కోరుకుంటోంది. బౌలింగ్ లో యుజ్వేంద్ర చాహాల్ కూడా మంచి పర్ఫామెన్స్ ను ఆశిస్తోంది.