Bastar-OTT : బస్తర్: ది నక్సల్ స్టోరీ 17 నుంచి అందుబాటులోకి..

Bastar-OTT

Bastar : The Naxal Story-OTT

Bastar-OTT : బస్తర్: ది నక్సల్ స్టోరీ చిత్రం ఓటీటీ విడుదలపై అదా మాట్లాడుతూ ‘బస్తర్’ ఒక సున్నితమైన, ప్రధానమైన సమస్యను పరిష్కరించే శక్తివంతమైన చిత్రం. థియేట్రికల్ రిలీజ్ సందర్భంగా అభిమానులు నా పాత్రపై చూపించిన ప్రేమాభిమానాలకు మురిసిపోయాను. డిజిటల్ ప్రీమియర్ తో ఈ చిత్రం మరింత విస్తృత ప్రేక్షకులకు చేరుతుందని, వారు తమ ప్రేమను, మద్దతును కొనసాగిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞురాలినని, ఇదొక తీవ్రమైన, సవాలుతో కూడుకున్న అనుభవం’ అని ఆమె అన్నారు.

‘కేరళ స్టోరీ’ తర్వాత మా ఇద్దరి కాంబోలో వచ్చిన రెండో చిత్రమిది, బస్తర్: ది నక్సల్ స్టోరీకి నిర్మాతగా వ్యవహరించడం గర్వంగా ఉందన్నారు. బస్తర్ తో ఛత్తీస్ గఢ్ లో అసంఖ్యాక జీవితాలను ప్రభావితం చేసిన నక్సల్స్ తిరుగుబాటుపై వెలుగులు నింపాలనుకున్నాం. ఈ శక్తివంతమైన కథను ముందుకు తీసుకురావడంలో మా ప్రయత్నాలను ప్రేక్షకులు అభినందిస్తారని నేను ఆశిస్తున్నాను. సుదీప్ తో, ఆదా, చిత్రబృందం అహర్నిశలు శ్రమించి ఆలోచింపజేసే చిత్రాన్ని రూపొందించారు’ అన్నారు.

‘బస్తర్ ప్రాంతంలో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న, అపారమైన విధ్వంసానికి కారణమైన నక్సల్స్ బెడదను వెలుగులోకి తెచ్చే గ్రిప్పింగ్ స్టోరీ ఇది. వాస్తవ ఘటనల నుంచి ప్రేరణ పొంది ఛత్తీస్ గఢ్ లో నక్సల్స్ తిరుగుబాటును ఎదుర్కోవడానికి అంకితభావం కలిగిన పోలీసు అధికారి ప్రయాణాన్ని ఈ చిత్రం అనుసరిస్తుంది’ అని అన్నారు.

TAGS