CM Chandrababu : పార్టీ కార్యాలయంలో బారికేడ్లు పెట్టిన పోలీసులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలిసేటప్పుడు బారికేడ్లు పెట్టవద్దని పోలీసులను చంద్రబాబు ఆదేశించారు. తనకు, ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని మరోసారి స్పష్టం చేశారు. ప్రజల సమ్యలు, వినతలు స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
‘‘సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉండాలో ఆలోచిస్తున్నాం. ప్రజా వినతులు స్వీకరణకు ఎక్కువ సమయం కేటాయిస్తా. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటాం. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలవరం సందర్శనతోనే నా క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమవుతుంది. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.