Barrelakka Sirisha : బర్రెలక్క లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. నాగర్ కర్నూల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కర్నె శిరీష (బర్రెలక్క) ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ ఎన్నకల్లో ఆమెకు 5,754 ఓట్లు వచ్చాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బర్రెలక్క తగ్గేదేలే అంటోంది. లోక్ సభ ఎన్నకల్లోనూ పోటీ చేసేందుకు నామినేషన్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాక, ఎలాంటి పరిస్థతినైనా ఎదుర్కొనగలిగే ధైర్యం వచ్చిందని ఆమె తెలిపింది. అసెంబ్లీ ఎన్నికలు తనను దృఢంగా మార్చాయని పేర్కొంది. ఓటుకు నోటు విధానాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తానని, ప్రజల్లో చైతన్యం తీసుకువస్తానని శిరీష (బర్రెలక్క) చెపుతోంది.