Barrelakka Contest MLA : కర్నె శిరీష అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. బర్రెలక్క అంటే మాత్రం ఇట్టే గుర్తు పడతారు. యూ ట్యూబ్ లో ఆమె చేసే వీడియోకు హ్యూజ్ వ్యూవ్స్ వస్తుంటాయి. బర్రెలు కాసుకునేటోళ్ల కష్టాలు, బర్రెలతో మాట్లాడడం, వాటిని మనుషుల్లానే పిలవడం లాంటివి చేస్తూ వీడియోలు తీస్తూ బాగా పాపులర్ అయ్యింది.
ప్రభుత్వాలు, అవి చేపడుతున్న పథకాలు, నిరుద్యోగం, ఉద్యోగాల కల్పన తదితరాలపై తన వీడియోల్లో మాట్లాడుతుంది. చదువుకున్నోళ్లు బర్రెలు కాస్తే ఏమవుతుంది? అంటూ ప్రశ్నిస్తుంది. అలాంటి బర్రెలక్క అతిపెద్ద సాహసం చేసింది. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో ఆమె అభ్యర్థిగా నిలబడింది. తనకు మద్దతివ్వాలని కోరుకుంటుంది.
గెలుపు అనేది మనచేతుల్లే లేదు. దాన్ని పక్కన పెడితే తమకు ఉన్న మద్దతు గురించి తెలుసుకోవాలనుకున్న ఆమె కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగింది.
కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏ నోట విన్నా బర్రెలక్క (శిరీష) పేరే వినిపిస్తుంది. ఆమెకు మద్దతు కూడా పెరుగుతుంది. ప్రజలు, విలేకరులు ఆమెకు సపోర్ట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. చదువుకున్న ఆమె మూడు ప్రధాన పార్టీలకు గట్టిపోటీలు ఇస్తుంది. ఆమె ప్రచార పాటకు యూ ట్యూబ్ లో మంచి వ్యూవ్స్ వస్తున్నాయి. ప్రజలు, ఆ నియోజకవర్గం ఓటర్లు ఎగబడి మరీ వింటున్నారు.
యువత, నిరుద్యోగులు కష్టాలు తనకు తెలుసనని ప్రచారం చేస్తుంది బర్రెలక్క. తనను గెలిపిస్తే పార్టీలతో సంబంధం లేకుండా తన నియోజకవర్గం నిరుద్యోగుల కోసం ప్రభుత్వంతో కొట్లాడుతానని చెప్తుంది. బర్రెలక్కగా ఫేమస్ అయిన శిరీష ఇప్పుడు మూడు పార్టీలకు కొరకరాని కొయ్యగా మారింది.