Barrelakka : పల్లవి ప్రశాంత్ తో తన పెళ్లి గురించి బాంబు పేల్చిన బర్రెలక్క!
Barrelakka : సోషల్ మీడియా అన్న తర్వాత రూమర్స్ అనేవి సర్వసాధారణం. కానీ ఈమధ్య ప్రచారం అవుతున్న కొన్ని వార్తలు మాత్రం సెలబ్రిటీస్ వ్యక్తిగత జీవితాలను డిస్టర్బ్ చేస్తుంది. రీసెంట్ గా పల్లవి ప్రశాంత్ తో బర్రెలక్క పెళ్లి అంటూ సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ ప్రచారం అయ్యింది. ఈమధ్య కాలం లో అనేక మంది సెలబ్రిటీస్ పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళ పెళ్లి కూడా నిజమేనేమో అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. అయితే దీనిపై బర్రెలక్క మొదటిసారి రెస్పాన్స్ ఇచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘ఇదంతా సోషల్ మీడియా లో వస్తున్నది మాత్రమే. నేను పల్లవి ప్రశాంత్ ని అన్నయ్య అని ప్రేమతో పిలుస్తాను. అన్నయ్య ని చెల్లి ఎక్కడైనా పెళ్లి చేసుకుంటుందా, నోటికి వచ్చినట్టు రాయడం మానుకోండి. ఇలాంటి పుకార్లు పుట్టించిన సైట్స్ ఏమిటో నాకు తెలుసు..వాళ్ళ మీద నేను ఎలాంటి స్ట్రైక్స్ వెయ్యడం లేదు. ఇలాంటి రూమర్స్ పుట్టించే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అంటూ బర్రెల్లక్క ఈ సందర్భంగా రెస్పాన్స్ ఇచ్చింది.