Barasala Celebration : లక్ష్మీదేవి పుట్టిందని.. ఘనంగా బారసాల వేడుక

Barasala Celebration
Barasala Celebration : ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు కావివి. సాక్షాత్తు లక్ష్మీదేవి పుట్టిందని సంతోషపడే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆ శుభవార్త విన్న వెంటనే ఆ కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మనుమరాలితో ఇంటికొచ్చిన కోడలికి అత్తింట్లో ఘన స్వాగతం లభిస్తోంది. చిన్నారికి బారసాల దగ్గర నుంచి పుట్టిన రోజు వరకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కృష్ణ కాలనీకి చెందిన ప్రశాంత్, వర్ష దంపతులకు తొలి సంతానం ఆడబిడ్డ పుట్టింది. తమ పాపకు నిత్యం లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని శాన్వి అని పేరు పెట్టారు. చిన్నారి బారసాలకు ఇంటిని అందంగా అలంకరించడంతో పాటు పాపను పడుకోబెట్టి రూ.లక్ష విలువైన రూ.5 నాణేలతో ‘వన్’ నంబరును అందంగా తీర్చిదిద్దారు. తమ కుమార్తె నిత్యం లక్ష్మీదేవిలా ఉండాలని ఈ విధంగా అలకరించినట్లు చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు.