CM Chandrababu : పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి: సీఎం చంద్రబాబు

CM Chandrababu
CM Chandrababu : పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. డీబీటీ పథకాల అమలు, అభివృద్ధికి బ్యాంకర్ల సహాయం అవసరమని చెప్పారు. సబ్సిడీ రుణాలు, వివిధ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్ర అని వ్యాఖ్యానించారు.