Bank account : బ్యాంక్ ఖాతా కేవైసీ చేయించారా..లేదా? లేదంటే మీ ఖాతాను కోల్పోవచ్చు!
Bank account KYC : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఒకటికి మించి బ్యాంక్ ఖాతాలు ఉంటున్నాయి. అయితే ఈ ఖాతాలు ఒక్కోసారి సడెన్ గా ఆగిపోవచ్చు. ఎందుకనుకుంటున్నారా.. అవునండి మీరు ఈ ఖాతా కేవైసీ పూర్తి చేయకపోతే బ్యాంక్ అధికారులు మీ ఖాతాను క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మొదట్ మీరు కేవైసీ అప్ డేట్ చేసుకున్న తర్వాతే ఖాతాను వినియోగించుకుంటే బాగుంటుంది. కేవైసీ చేసుకుంటేనే మీరు లావాదేవీలు సవ్యంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అందుకే చాలా వరకు బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారులు కేవైసీకి సంబంధించిన ఫోన్ సందేశాలు పంపిస్తున్నారు.
అయితే దేశంలో 10కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన కేంద్రం కీలక అప్ డేట్ ఇచ్చింది. వీటన్నింటినీ తప్పకుండా అప్ డేట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అయితే ఇందులో చాలా వరకు జన్ ధన్ ఖాతాలకు సంబంధించినవే ఉన్నాయి. 2014లో ఈ పథకం ప్రారంభించినప్పుడు ఎక్కువ మంది ఈ ఖాతాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఖాతాలకు సంబంధించి పదేండ్లు ముగిశాయి. ఇక ఈ ఖాతాలను కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. గత ఆగస్టు వరకు దేశంలో సుమారు 58 కోట్ల జన్ ధన్ ఖాతాలు నమోదయ్యాయి. ఇందులో సుమారు 10 కోట్ల ఖాతాలను మాత్రమే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు బ్యాంకులకు ఇప్పటికే ఆదేశించారు.
ప్రస్తుతం ఈ జన్ ధన్ యోజన ఖాతాలకు సంబంధించి కేవైసీ ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఈ ప్రక్రియ కు సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ విధానాలను వినియోగించుకోవచ్చునని వారు చెబుతున్నారు. కచ్చితంగా ఈ ఖాతాలను అప్ డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ సందేశాలు రాని వారు కూడా ఖాతా ఉన్న బ్రాంచీని సంప్రదిస్తే బాగుంటుందని సూచిస్తున్నది. మరి ఇంకేం ఖాతాదారులు ఒకసారి ఈ అప్ డేట్ ప్రక్రియ పై దృష్టిపెట్టండి.