Bangladesh porn star Arrest : బంగ్లాదేశ్ కు చెందిన ఎనిమిది మంది భారత్ లో అక్రమంగా ఉంటున్నారని గ్రహించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అందులో బంగ్లాదేశ్ కు చెందిన పోర్న్ స్టార్ రియా బర్డే కూడా ఉన్నారు. ఏడుగురిని నవీ ముంబైలో అరెస్ట్ చేయగా, రియా బర్దేను థానేలోని అంబర్నాథ్ సిటీలో అరెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐ పోలీస్ స్టేషన్కు చెందిన బృందం మంగళవారం సాయంత్రం నేవీ ముంబైలోని కరావే గ్రామంలో నివాసంపై దాడి చేయగా.. అక్కడ రెండు గదుల్లో ఉంటున్న మహిళలను అదుపులోకి తీసుకుంది. వీరు భారతదేశంలోకి అక్రమంగా చొరబడ్డారు. సరైన పత్రాలు లేకుండా గ్రామంలో నివసిస్తున్నారు. వీరితో పాటు మరొక మహిళ అంబర్నాథ్లో బోగస్ పత్రాలతో నివసిస్తున్నట్లు తెలియడంతో హిల్లైన్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమె రియా అరవింద్ బర్డేగా గుర్తించారు. బెంగాల్ లోని నార్త్ 24 పరగణాస్ జిల్లా నుంచి బర్త్ సర్టిఫికెట్, బంగ్లాదేశ్ లోని పాఠశాల నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) తీసుకుందని వెల్లడైంది. వీటిని ఉపయోగించి పాస్ట్ పోర్ట్ తయారు చేసుకుంది. దీంతో పాటు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని అచల్పూర్లో మూడు వేర్వేరు చోట్ల నుంచి బర్త్ సర్టిఫికెట్లు కూడా తయారు చేయించుకుంది. అమరావతికి చెందిన ఒకరు రియా, ఆమె ముగ్గురు సహచరులకు భారతదేశంలో అక్రమంగా ఉండేందుకు నకిలీ పత్రాలను రూపొందించారు. ప్రస్తుతం ఈ కేసులో మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. శిల్మాశెట్టి భర్త, నిర్మాత రాజ్ కుంద్రాకు చెందిన చాలా సినిమాల్లో రియా బర్డే నటించారు.