Actress Hema : బెంగళూరు రేవ్ పార్టీ.. జైలు నుంచి నటి హేమ విడుదల
Actress Hema : బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ ఈరోజు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఆమెకు షరతులతో కూడిన బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా, బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో హేమ మాదక ద్రవ్యాలను తీసుకున్నట్లు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నటి హేమ బెయిల్ కోసం పిటిషన్ వేయగా స్థానిక కోర్టు మంజూరు చేసింది.
నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అయితే, హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.