Bandi Sanjay:త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనకొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డికి భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ లేఖ రాశారు, మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమని చెప్పారు. ఈ మేరకు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యలను లేఖలో
సంజయ్ ప్రస్తావించారు.
ఒక్కో బాధిత కుటుంబానికి ఇళ్ల నిర్మాణానికి రూ.5.04 లక్షలు చెల్లించాలని విన్నవించారు. నీరోజిపల్లి నుంచి నందిగామ అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌తో పాటు డెవలప్మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని కోరారు. అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను కోరారు.