Bandi Sanjay : బండి సంజయ్ సాధారణ బీజేపీ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన తీరు అందరితో ఔరా అనిపిస్తుంది. చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఒంటపట్టించుకున్న సంజయ్.. బీజేపీ కార్యకర్తగా, కార్పొరేటర్ గా, ఎంపీగా , రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కింది స్థాయి నుంచి వచ్చి ఓ జాతీయ పార్టీకి సక్సెస్ ఫుల్ రాష్ట్ర అధ్యక్షుడు కావడం అంతా ఈజీ కాదు. పార్టీ పట్ల ఎంతో కమిట్ మెంట్ ఉన్న సంజయ్..తనకు అప్పజెప్పిన విధులను పక్కాగా నిర్వర్తించారని ప్రతీ బీజేపీ కార్యకర్త భావిస్తాడు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నన్ని రోజులు ఆ పార్టీ రాష్ట్రంలో ఫుల్ జోష్ చూపించింది. అధికార బీఆర్ఎస్ కు సంజయ్ ముచ్చెమటలు పోయించారు. పార్టీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తయారుచేశారు. ఏమైందో ఏమో కానీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ఆ పార్టీ స్వయంకృతపరాధమే. అధికారం లేదా రెండో స్థానంలో ఉండాల్సిన పార్టీ మూడో స్థానానికి పడిపోయింది.
కాగా, బండి సంజయ్ కు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న సంగతి తెలిసిందే. సంజయ్ కరసేవకుడిగా కూడా పనిచేశాడు. మొన్న అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం ముందు రోజు బండి సంజయ్ తాను యువకుడిగా, కరసేవకుడిగా ఉన్న టైంలో రోజులను గుర్తుకు తెచ్చుకున్నారు. బాబ్రీ మసీదు దగ్గర కరసేవలో పాల్గొన్నప్పటి ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేసి ఎమోషనల్ అయ్యారు.
‘అయోధ్య రామమందిర ప్రారంభం చూసేందుకు నేను బతికి ఉన్నందుకు.. నా మనసు ఆనందంతో పొంగిపోతోంది’’ అంటూ ట్వీట్ చేయడం బీజేపీ శ్రేణులనే కాదు అందరినీ కదిలించింది. బాబ్రీ మసీదు కూల్చివేత నాటి బండి సంజయ్ ఫొటోలు చూసి చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. ఇప్పటికీ ఆ ఫొటోలను బీజేపీ శ్రేణులు షేర్ చేస్తుండడం విశేషం.
As we gear up for the big day for all Hindus tomorrow, #AyodhyaRamMandir Pran Pratistha, here is a throwback of me participating in Karseva.
From saying “Mandir Wahi Banega” to “Mandir Bangaya hai” we came a long way. My heart fills with joy that I am alive to witness this… pic.twitter.com/bQFoQoQvHb
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) January 21, 2024