JAISW News Telugu

Imran Khan : పాకిస్థాన్ లో ఇమ్రాన్ ఖాన్ పార్టీపై నిషేధం

Imran Khan

Imran Khan

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ)పై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు. ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడం, అల్లర్లకు ప్రేరేపించినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అందుకే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీని 1996లో స్థాపించారు. 2018లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అయితే, అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడం వల్ల ఇమ్రాన్ ప్రభుత్వం ఏప్రిల్ 2022లో కూలిపోయింది. పలు కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. రిజర్వుడు సీట్ల కేసులో పీటీఐ పార్టీకి, అక్రమ వివాహం కేసులో ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఇటీవల ఊరట దక్కిన నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Exit mobile version