Balkampet Yellamma Kalyanam : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. దర్శించుకున్న ప్రముఖులు

Balkampet Yellamma Kalyanam
Balkampet Yellamma Kalyanam : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలకబూనారు. ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం అసహనం వ్యక్తం చేశారు. ఆయనకు స్వాగతం పలికే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ప్రొటోకాల్ పాటించలేదని ఆయన కొద్దిసేపు అలిగి బయటే ఉన్నారు.