Daaku Maharaj : ‘గాడ్ ఆఫ్ మాస్’ నందమూరి బాలకృష్ణ వరుస పెద్ద హిట్‌లతో ఇండస్ట్రీని ఊపేస్తున్నారు. తాజాగా బాబీ దర్శకత్వంలో బాలయ్య తన 109వ చిత్రాన్ని చేస్తున్నారు. ‘డాకు మహారాజ్’ అనే టైటిల్‌ని ఈ సినిమాకు మేకర్స్ నిర్ణయించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఏకంగా అమెరికాలో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నాడు నిర్మాత నాగవంశీ. జనవరి 4వ తేదీ సాయంత్రం 6:00 గంటల నుండి USAలోని టెక్సాస్‌లోని డల్లాస్‌లో ప్రివ్యూ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఇందుకోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత నాగ వంశీ గతంలో ఎన్నడూ లేని విధంగా డాకు మహారాజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తున్నాడు. నాగవంశీ తన అభిమాన హీరో కోసం ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసాడు, దాని గురించి అందరూ చాలాసేపు మాట్లాడుకునేలా ఈవెంట్ ను తీర్చిదిద్దబోతున్నాడు.
శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేస్తోంది. తొలిసారిగా అమెరికాలో బాలయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండడంతో నందమోరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.