Balakrishna Surprised : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 ప్రమోషన్ కార్యక్రమాల్లో లో బిజీగా ఉన్నారు. ఇటీవల బిహార్ రాజధాని పట్నా లో మూవీ మేకర్స్ భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ గ్రాండ్ గా సక్సెస్ అయ్యింది. భారీ గా ఫ్యాన్స్ తరలి వచ్చారు. ఈ వేడుకకు భాలీవుడ్ సెలెబ్రిటీల తో పాటు ఈ సినిమాలోని నటీనటులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక మందన్నా సందడి చేసింది. తన మాటలతో ప్రేక్షకుల్లో హుషారెత్తిం చింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తనపై అక్కడి ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. అక్కడితో ఆగకుండా మరికొన్ని చోట్ల కూడా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. సినిమా రిలీజ్ కు ముందు తనకున్న బిజీ షెడ్యూల్ లోనూ తెలుగు ప్రేక్షకులకు సైతం మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఇటీవల విడుదలై ఆకట్టుకోగా.. తాజాగా మరో ఎపిసోడ్ ప్రోమోను ఆహా ఓటీటీ విడుదల చేసింది. ఈ ప్రొమోలో అర్జున్ పిల్లలు అయాన్, అర్హ కూడా సందడి చేశారు. ఇక బాలయ్య ఎప్పటి లాగే తనదైన పంచులు, డైలాగులతో ఆకట్టుకున్నాడు. బన్నీ పిల్లలను సైతం తన మాటలతో ముగ్ధులను చేశారు. ఇక అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా బాలయ్యను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు పద్యం పాడి ఔరా అనిపించింది. అర్హ పాడిన పాటకు బాలయ్య ఫిదా అయ్యారు. ఆమె పద్యం పాడిన తీరును చూసి ముచ్చటపడిపోయారు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు. మీ లాంటి వారు ఉంటే తెలుగు నాలుగు కాలాలపాటు వర్దిల్లతుందంటూ అర్హను ప్రశంసించారు.
అర్హా తెలుగులో పద్యం పాడగా.. బాలకృష్ణ ప్రశంసించారు. ఈ ఎపిసోడ్ నవంబర్ 22న ప్రసారం కానుంది. ఈ షోలో బాలయ్య మరిన్ని నవ్వులు పూయిస్తున్నారు.