Balakrishna-Venkatesh : కెరీర్ పరంగా బాలయ్య ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్నాడు. వరుసగా హ్యాట్రిక్ కొట్టడంతో బాబీ దర్శకత్వంలో వస్తున్న 109వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తుండడంతో ఆ సినిమాకు తాత్కాలిక విరామం ప్రకటించిన బాలయ్య ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోయారు. అప్పటివరకు హీరోలేని సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరించనున్నారు.
ఇదిలా ఉండగా సినీ ఇండస్ట్రీలో బాలయ్య, వెంకటేశ్ సన్నిహితంగా ఉండేవారు. తరుచుగా ఫోన్ చేసి మాట్లాడుకోవడమే కాకుండా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంటుందంటారు. కావాలంటే కొంత సమయం ఫోన్ లో ఇద్దరూ తింటుకుంటారని, మరోసారి పోట్లాడుకుంటారని, నాగార్జున, చిరంజీవి కన్నా వెంకటేశ్ తోనే బాలయ్య ఎక్కువ స్నేహంగా ఉంటారని అంటారు. తరుచుగా వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటారని టాక్. బాలకృష్ణ ఆహాలో అన్ స్టాపబుల్ షో చేస్తున్న సంగతి తెలిసిందే. కార్యక్రమానికి ఎంతో మందిని నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారు.
అలాగే వెంకటేశ్ ను కూడా రావాలని పిలిచారు. అయితే వెంకీకి మొదటి నుంచి ఎటువంటి టాక్ షోలకు, ఇతర కార్యక్రమాలకు హాజరు కావడం ఇష్టం ఉండదు. అదే విషయాన్ని బాలకృష్ణకు వెంకీ తెలిపి సున్నితంగా తిరస్కరించాడు. అయితే పట్టువదలకుండా బాలయ్య మాత్రం వెంకీకి ఫోన్ చేసి రావాలని కోరుతుండడంతో కొద్ది రోజులు బాలయ్య నంబర్ ను వెంకీ బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వీటిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. సైంధవ్ ప్లాప్ కావడంతో ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనదైన శైలిలోనే సినిమాలు చేయాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.