Balakrishna : వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలను ప్రతి పార్లమెంట్ ప్రతిపాదికగా ఏర్పాటు చేశారు. జిల్లాల నుంచి పరిపాలన మొదలు కాగా.. పునర్వ్యవస్ధీకరణ వల్ల జిల్లాల సంఖ్య 13 నుంచి 26కి పెరగ్గా పాత జిల్లాలను యథావిధిగా ఉంచారు. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి , కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య పేర్లతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు.
జిల్లాల పునర్విభజన సమయంలో వైసీపీ ప్రభుత్వం అనేక సమస్యలు ఎదుర్కొంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను విభజించి వాటిలో ఒకదానికి దివంగత మోహనరంగా పేరు పెట్టాలని కాపులు డిమాండ్ చేశారు. కానీ దీన్ని జగన్ సర్కారు పట్టించుకోలేదు. జిల్లాలకు పెట్టిన పేర్లు కూడా ఉద్రికత్తలు పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రాంతంలో బీఆర్ అంబేడ్కర్ కోనసీమ పేరు పెట్టారు. దీన్ని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. దీంతో ఆ ప్రాంతంలో ఘోరంగా విధ్వంసం కూడా జరిగింది.
ఎన్టీఆర్ పేరుతో విజయవాడ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. దీన్ని చాలా మంది తప్పుబట్టారు. రాజంపేట పట్టణాన్ని ముఖ్య కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసిన అన్నమయ్య జిల్లానే రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేశారు. లోక్ సభ నియోజకవర్గాలైన నర్సాపురానికి బదులు భీమవరం, హిందూపురానికి బదులు పుట్టపర్తిలను జిల్లా కేంద్రాలను చేశారు. కానీ ఇక్కడ చాలా ఉద్యమాలు జరిగాయి. జగన్ సర్కారు వాటిని పట్టించుకోకుండా హిందూపురం కాకుండా పుట్టపర్తినే జిల్లా గా చేశారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జిల్లాల విభజన అంశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురం చేయాలనే డిమాండ్ ఉంది. హిందూపురంలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా చోట్ల డిమాండ్లు ఉన్నాయి. అయితే జిల్లాల పేర్లు అలాగే ఉంచి జిల్లా కేంద్రాలను మార్చే ఆలోచన చేస్తున్నామని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.