Rupa Lakshmi : ఆ పనికి 70 ఏళ్ల ముసలోడు అయినా ఓకే.. బలగం నటి రూప లక్ష్మి కామెంట్స్..!

Balagam Rupa Lakshmi

Balagam Rupa Lakshmi

Rupa Lakshmi : ఎప్పటి నుండో సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఏమాత్రం పాపులారిటీ లేకుండానే లైఫ్ లీడ్ చేసే నటీనటులు ఎంతో మంది ఉన్నారు.. అయితే ఇలాంటి వారికీ ఒకే ఒక్క సినిమాతో సుడి తిరిగి పాపులర్ అయ్యిన వారు ఉన్నారు. మరి ఈ లిస్టులోకే సీనియర్ నటీమణి రూప లక్ష్మి కూడా వస్తుంది..

ఈమె బలగం సినిమాతో పాపులర్ అయ్యింది. కమెడియన్ వేణు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎన్నో అవార్డులను మరెన్నో ప్రశంసలను అందుకుంది.. థియేటర్స్ లో భారీ విజయం సొంతం చేసుకున్న ఈ సినిమాలో రూప లక్ష్మి కూడా నటించారు. హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ కు తల్లిగా రూప లక్ష్మి నటించి తన నటనతో ఆకట్టుకుంది.

ఈ సినిమాతో ఒక్కసారిగా పేరు తెచ్చుకున్న ఈమె బలగం సినిమా ప్రమోషన్స్ సమయంలో రూప లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ”చిన్న వయసులోనే తల్లి పాత్రను పోషించారు.. రేపు ప్రభాస్ వంటి స్టార్ హీరోలకు తల్లిగా చేయమని అడిగితే చేస్తారా? అనే ప్రశ్నను విలేకరి అడుగగా అందుకు ఈమె జవాబు చెబుతూ..

ప్రభాస్ అనే కాదు.. 70 ఏళ్ల వ్యక్తికి కూడా అమ్మగా నటించమంటే నటిస్తా.. నాకు ఎలాంటి సమస్య లేదు.. స్టార్ హీరోలకు అమ్మ పాత్రలో నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.. మహిళా జీవితంలో సంతృప్తిగా ఉండేది అమ్మ స్థానం కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నేను నటించడానికి ఎప్పుడు సిద్ధమే.. అంటూ అప్పట్లో ఈమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..

TAGS