Johnny master Bail : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరైంది. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం జానీ పిటిషన్ పెట్టుకున్నప్నటికీ దానిని కోర్టు తిరస్కరించింది. అయితే, తాజాగా బెయిల్ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.
జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్ కు చెందిన యువతి సెప్టెంబరు 15న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్ లభించింది. అక్టోబరు 25న చంచల్ గూడా జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల కానున్నారని సమాచారం.