AAP Leader Satyender Jain : మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఆయనకు బెయిల్ మంజూరయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా, అందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. మనీలాండరింగ్ కేసులో 2022, మే నెలలో సత్యేందర్ జైన్ అరెస్టయ్యారు.
2015 నుంచి 2017 వరకు వివిధ వ్యక్తుల పేర్లతో చరాస్తులు సంపాదించారని సీబీఐ ఫిర్యాదు మేరకు జైన్ పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. కనీసం నాలుగు కంపెనీల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు జైన్ పై ఆరోపణలు ఉన్నాయి. జైన్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాత్రం.. దర్యాప్తు సంస్థల ఆరోపణలను తోసిపుచ్చారు. ఈడీ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. తగిన ఆధారాలు కూడా లేవన్నారు.