Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Nandigam Suresh
Nandigam Suresh : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నందిగం సురేశ్ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో బెయిల్ పిటిషన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సురేశ్ ఈ కేసులో అరెస్టయి గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.