Bail is not Right For Babu : చంద్రబాబుకు బెయిల్ సరికాదు.. సాక్షి చెప్పిందే నిజమంటున్న సజ్జల
Bail is not Right For Babu : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ గతంలో కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో ఆయనను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా, ఆయనకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత 52 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో, ముందస్తు బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. అయితే తాజాగా ఈ కేసులో సాక్ష్యాలు చూపించలేకపోయారని ఏపీ హైకోర్టుల పూర్తిస్థాయి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది.
అయితే దీనిపై వైసీపీలో నంబర్ 2, ప్రభుత్వంలో పాలనను అన్నీ తానై నడిపిస్తున్న సజ్జల స్పందించారు. హైకోర్టు తీర్పు ను కూడా తప్పుబట్టారు. కేవలం సాక్షి మీడియాలో వచ్చిందే నిజమనే రేంజ్ లో రెచ్చిపోయి మాట్లాడారు. ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, ఏజీ పొన్నవోలు చెప్పిందే నిజమని, వందల కోట్లు చేతులు మారాయాని చెప్పే ప్రయత్నం చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో నిధులు షెల్ కంపెనీల పేరుతో పోయాయని చెప్పారు. అయితే ఆధారాలు మాత్రం చూపించలేకపోయారు. కిలారి రాజేశ్ ,పెండ్యాల రాజేశ్ కు నోటీసులు ఇచ్చారు. అయితే కిలారి రాజేశ్ ను ఇంకా నిందితుల జాబితాలో అసలు సీఐడీ చేర్చలేదు.
చంద్రబాబుపై ఉన్న వి అభియోగాలు మాత్రమే అని మరిచి, సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదో తప్పు జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు చంద్రబాబును ప్రజాక్షేత్రం లో లేకుండా చేసేందుకు 8 వరుస కేసులు పెట్టారని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతున్నది. ఇప్పుడేదో తామే కరెక్ట్, తమకు అవినీతే తెలియదు అనే రేంజ్ లో సజ్జల మాట్లాడారు. ఏదేమైనా భవిష్యత్ లో ఈ కుట్రలన్నింటికీ బదులు చెప్పక తప్పదని టీడీపీ నాయకత్వం చెబుతున్నది. దీని వెనుక ఉన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆ పార్టీ నాయకులు పదే పదే పలు సందర్భాల్లో వ్యాఖ్యానిస్తున్నారు.