News Click Founder : న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడికి బెయిల్ మంజూరు

News Click Founder
News Click Founder : న్యూస్ క్లిక్ వెబ్ సైట్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఉగ్రవాద చట్టం కింద అరెస్టయిన ఆయనను విడుదల చేయాలని ఆదేశిస్తూ.. బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆ అరెస్టు చట్టవిరుద్ధమని, ఈ కేసులో తగిన ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది.
న్యూస్ క్లిక్ కు చైనా నుంచి రూ. కోట్ల నిధులు అందుతున్నాయంటూ గత ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ సహా పలు అమెరికా పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీంతో ఈడీ కేసు నమోదు చేసి, సోదాలు నిర్వహించింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింది ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం న్యూస్ క్లిక్ ఆఫీసులు, ఆ సంస్థ పాత్రికేయుల నివాసాల్లో ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు చేపట్టి ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పురకాయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు.
తమను అరెస్టు చేసి, రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ వారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు పురకాయస్థ కు బెయిల్ మంజూరు చేసింది. ఇదివరకే అప్రూవర్ గా మారుతానంటూ అమిత్ చక్రవర్తి చేసుకున్న అభ్యర్థనను న్యాయస్థానం అనుమతించిన సంగతి తెలిసిందే.