KTR : ఎమ్మెల్సీ కవితకు బెయిల్.. కేటీఆర్ హర్షం
KTR : ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఆమె సోదరుడు, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేశారు.
కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేశారని బండి సంజయ్ తీరును ఆయన తప్పుబట్టారు. కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా అని విమర్శించారు. దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.