Money laundering case : మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2014లో క్యాష్ ఫర్ జాబ్స్ స్కాంలో అరెస్ట్ అయిన ఆయనకు లేటెస్ట్ గా బెయిల్ వచ్చింది. 2014లో రవాణా శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపణలు చేసింది. 2015 జూన్ 14న ఈడీ ఆయనను అరోస్టు చేయడంతో ఎఐఎడిఎంకె ప్రభుత్వం రవాణా శాఖ మంత్రి పదవి నుంచి తొలగించింది.
ఆగస్ట్ 12, 2018, బాలాజీపై ఈడీ మూడు వేల పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. అక్టోబరు 19న బాలాజీ గతంలో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా బెయిల్ మంజూరు చేసింది.